ప్రభాస్ వస్తే అందరికీ సమస్యలే

ప్యాన్ ఇండియన్ టాప్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఇతర సినిమా మేకర్స్ కు వణుకు పుట్టిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అనే భయం టాలీవుడ్ లో ఉంది. సలార్ రిలీజ్ డేట్ తో పాటు ఇతర సినిమాలు కూడా తమ తమ చిత్రాల విడుదల తేదీలు ప్రకటించి ఉన్నాయి. సలార్ వాయిదా తర్వాత కొత్త డేట్ ఈ సినిమాలను ఎక్కడ ఇబ్బంది పెడుతుందా అని భయంతో ఉన్నారు. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సినిమాలకు సలార్ కొత్త డేట్ వణుకు పుట్టిస్తోందని చెప్పాలి.


సలార్ ను ఈ డిసెంబర్ 22న విడుదల చేస్తారు అనే వార్తల బాగా వినిపిస్తోంది. ఈ విషయం మేకర్స్ అఫీషియల్ గా చెప్పలేదు. అయినా డిసెంబర్ 22నే సలార్ అంటూ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ టైమ్ కు వస్తోన్న, వెంకటేష్ సైంధవ్, నాని హాయ్ నాన్నతో, పాటు నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మేన్ చిత్రాలకు సమస్యలు తప్పువు అని చెప్పాలి.

నిజానికి వీళ్లు క్రిస్మస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుని చాలా రోజులే అవుతోంది. వీరిపై ఇప్పుడు సలార్ అటాక్ చేస్తే మళ్లీ వారికి కొత్త డేట్ దొరకాలంటే జనవరి మూడో వారం తర్వాతే అవుతుంది. అప్పటికి ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దీంతో సమస్యలు తప్పవు. అందుకే సలార్ క్రిస్మస్ కు రాకూడదని వీరంతా కోరుకుంటున్నారు. కాదూ అని ప్రభాస్ సినిమా వస్తే ప్రాబ్లమ్ వీరికే కాదు.. సలార్ కూ ఉంటుంది.


క్రిస్మస్ సందర్భంగానే రెండు సినిమాలతో ఈ యేడాదే రెండు వేల కోట్లు కలెక్ట్ చేసి మంచి ఊపులో ఉన్న షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీల డంకీ సినిమా వస్తోంది. డంకీని డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు.

ప్రభాస్ ఆ సినిమాతో పెట్టుకుంటే టాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. థియేటర్స్ ఇష్యూ కూడా ఉంటుంది. ఇది రెండు సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఓపెనింగ్ డే రిజల్ట్స్ ను ప్రభావితం చేస్తుంది. సో.. ప్రభాస్ వస్తే చిన్న సినిమాలకు ప్రాబ్లమ్.. అదే టైమ్ లో అతనికీ షారుఖ్ మూవీతో సమస్య తప్పదు.

Related Posts