రాహుల్ సాంకృత్యన్ కు సూపర్ ఆఫర్

ఫస్ట్ మూవీ ది ఎండ్ తో ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. హారర్ బ్యాక్ డ్రాప్ లో వైవిధ్యమైన కథతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పారా నార్మల్ కంటెంట్ తోనే అప్పటికి అప్ కమింగ్ అనిపించుకున్న విజయ్ దేవరకొండతో టాక్సీవాలా అనే సినిమా చేశాడు.

ఈ మూవీ విడుదలకు అనేక సమస్యలు వచ్చాయి. అదే టైమ్ లో పెళ్లి చూపులు విడుదల కావడం, అర్జున్ రెడ్డి, గీత గోవిందం బ్లాక్ బస్టర్స్ కావడంతో విజయ్ కి క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ తో విడుదలైన టాక్సీవాలా బానే ఆకట్టుకుంది. అప్పటికి విజయ్ దేవరకొండ ఇమేజ్ మారింది కాబట్టి కొంత తక్కువ హిట్ అనే చెప్పాలి. అయినా దర్శకుడుగా రాహుల్ ఆకట్టుకున్నాడు. ఈ మూవీ చూసే నాని ఆఫర్ ఇచ్చాడు.


నానితో చేసిన శ్యామ్ సింగరాయ్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. పెద్ద హీరోలను కూడా హ్యాండిల్ చేయగలను అనే కాదు. అతను ఎంచుకునే కథలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనే సంకేతం ఇచ్చాడు. ఈ మూవీ అనుకున్నంత పెద్ద హిట్ కాదు. కానీ దర్శకుడుగా మళ్లీ మెప్పించాడు. కాకపోతే మరో సినిమా రావడానికి టైమ్ పట్టింది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అదీ దిల్ రాజు బ్యానర్ లో కావడం విశేషం.


ప్రస్తుతం దిల్ రాజు.. విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ను తన బ్యానర్ లోనే చేసేలా ఒప్పించాడు. ఆ ప్రాజెక్ట్ ను రాహుల్ సాంకృత్యన్ కు ఇవ్వబోతున్నాడు దిల్ రాజు. ఆల్రెడీ అతని టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి విజయ్ కూడా నో చెప్పే ఛాన్స్ లేదు. పైగా ఇప్పుడు విజయ్ క్రేజ్ ఏంటో తెలుసు కాబట్టి రాహుల్ కూడా అందుకు తగ్గ కథతోనే వస్తాడని వేరే చెప్పక్కర్లేదు. మొత్తంగా మోస్ట్ టాలెంటెడ్ అన్న రాహుల్ కు ఈ ఆఫర్ అయినా కెరీర్ ను టర్న్ చేస్తుందేమో చూడాలి.

Related Posts