ఈ ఆఫర్‌ వచ్చినపుడు మొదట భయపడ్డాను – టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్‌రామ్‌

తెలుగులో వస్తున్న కమర్షియల్ సినిమాలో డీజె టిల్లు కు ప్రత్యేక స్థానం ఉంది. టిల్లు మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆడియెన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. సిద్దు జొన్నలగడ్డ , నేహాశెట్టి పంచిన ఎంటర్‌టైన్‌మెంట్ కి డబుల్ డోస్‌తో ఇప్పుడు టిల్లు స్క్వేర్ వస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మిస్తున్న ఈ మూవీకి మల్లిక్‌ రామ్‌ డైరెక్షన్‌ చేస్తున్నారు. 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్ మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.


సిద్దు , తను ఒకేసారి సినీ జర్నీ ప్రారంభించామనీ.. ఆ పరిచయంతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. . నా ‘అద్భుతం’ సినిమా సిద్దు ‘డిజె టిల్లు’ ఒకేసారి విడుదలయ్యాయి… సీక్వెల్ కి వచ్చేసరికి డిజె టిల్లు డైరెక్టర్‌ విమల్‌కృష్ణ వేరే కమిట్‌మెంట్స్ తో బిజీ అయ్యాడు.. దాంతో నాగవంశీ సజెషన్‌ మేరకు ఈ ప్రాజెక్ట్‌లో ఎంటర్‌ కావడం జరిగింది. మొదట్లో కాస్త సంకోచించినా కథ పర్‌ఫెక్ట్ గా రావడంతో ముందడుగు వేసానన్నారు.


నేను చేసిన సినిమాలన్నీ వేరేవారు రాసిన కథలే. ఇప్పుడు ఈ సినిమా కూడా కథ సిద్దుదే.. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, సిద్దు , నేను 12 ఏళ్లుగా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాం.. ఈ సినిమాతో వస్తే ఆనందమే.. ఈ కథకు సిద్దుకు మంచి పేరొస్తే నాకు ఇంకా ఆనందం అన్నారు మల్లిక్ రామ్. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశామన్నారు.


డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుందన్నారు.అనుపమ ఈ సినిమాలో లిల్లీ గా నటించింది. ఈ పాత్ర ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అనుపమని బోల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుందన్నారు.


ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగిందన్నారు మల్లిక్.


థమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నామన్నారు.నిర్మాతలు బడ్జెట్ గురించి ఎప్పుడూ మాట్లాడరు. కంటెంట్ గురించి , క్వాలిటీ గురించే ఎక్కువ మాట్లాడతారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు. సితార బ్యానర్ లో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ సినిమాతో ఎలాంటి సందేశాలు ఇవ్వట్లేదని తెలియజేసారు టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్‌.

Related Posts