మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్ స్టార్ట్ చేసిన ధనుష్‌

సినీ సంగీతం అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు ఇళయరాజా. ఎన్నో సూపర్‌హిట్ పాటలందించిన మ్యూజిక్ డైరెక్టర్‌. ఇప్పటికీ ఆహ్లాదకరమైన సాయంత్రాలను ఎంజాయ్ చేయాలంటే ఇళయరాజా పాటలతోనే సాధ్యమనేవారున్నారు. ప్రణయ, పరిణయ, విరహ, విషాద, ఉత్సాహ భరితం.. ఇలా ఏ జోనర్‌ తీసుకున్న ఇళయరాజా పాటలు మరపురాని మధురానుభూతిని పంచినవే. ఇప్పుడు ఇళయరాజా బయోపిక్ కి రంగం సిద్దమైంది. స్టార్ హీరో ధనుష్‌ ఇళయరాజా బయోపిక్‌లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. కెప్టెన్‌ మిల్లర్‌ డైరెక్టర్‌ అరుణ్‌ మాదేశ్వరన్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తున్నాడు. చెన్నైలో ఈ మూవీ ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విచ్చేసారు. కనెక్ట్ మీడియా, పి.కె.ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యురీ మూవీస్ బ్యానర్స్‌పై శ్రీరామ్ భక్తిశరణ్, సి.కె.పద్మకుమార్, వరుణ్ మాథుర్, ఇలం పరితి గజేంద్రన్, సౌరభ్ మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ కార్యక్రమంలో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా కూడా పాల్గొన్నారు.

చిన్నప్పటి నుంచి నేను మాస్ట్రో ఇళయరాజాగారు అందించిన అద్భుతమైన మెలోడి పాటలను విని మైమరచిపోయేవాడిని. ఇప్పుడు ఆయన బయోపిక్ చేస్తుండటం చూస్తుంటే కల నిజమైనట్లు అనిపిస్తుంది. నా జీవితంలో మరచిపోలేని క్షణాలవి. మనం మనసులో బలంగా కోరుకుంటే అవి నిజమవుతాయని అంటుంటాం. జీవితం అనేది అసాధారణమైన విషయం ఎన్నో మరుపరాని క్షణాలు, అనుభవాలతో అల్లిన వస్త్రంలాంటిది. మనం హృదయపూర్వకంగా బలంగా ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు అవి నిజమవుతాయి. చాలా మంది ప్రశాంతమైన నిద్ర కోసం ఆయన పాటలతో సాంత్వన పొందుతుంటారు. అయితే నేను మాత్రం ఆయన అసాధారణ జీవితాన్ని వెండితెరపై చిత్రించాలనే కలల్లో మునిగిపోయానన్నారు ధనుష్‌.

ఈ సందర్భంలో ఇళయరాజాగారికి నిజమైన ఆరాధకుడు, గౌరవనీయులైన కమల్ హాసన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రేమ, కళాత్మకతను జోడించాల్సిన సమయం. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ ఓ గొప్ప బాధ్యతను స్వీకరించారు. ఈ ప్రయాణంలో ప్రతీ క్షణాన్ని తను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా తనకు నేను తోడ్పాటు అందిస్తానన్నారు.

భారతరత్న అవార్డ్ గ్రహీత ఇళయరాజా గురించి చేస్తున్న సినిమాను అరుణ్ అస్వాదించవచ్చు. అంతేకాకుండా దాన్ని చక్కటి సినిమాగానూ ప్రదర్శింప చేయవచ్చు. ఇది అనేకమంది వ్యక్తులపై వైవిధ్యమైన ప్రభావాలను చూపుతుంది. ఈ సినిమాకు పదికిపైగా వ్యాఖ్యాలు కూడా ఉంటాయి. కాబట్టి దర్శకుడు సంగీత ప్రపంచానికి గర్వ కారణమైన ఇళయరాజా బయోపిక్ను తనదైన కోణంలో తెరకెక్కించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కమల్‌ హాసన్.

Related Posts