సంబరాలు ముగిశాయి.. సెట్స్ లోకి పుష్పరాజ్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ రావడం పట్ల తెలుగు సినిమా పరిశ్రమ యావత్తు హర్షం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డ్ అందుకున్న ఫస్ట్ హీరో అతనే కావడం అన్నికంటే పెద్ద విశేషంగా చెప్పాలి.

అవార్డ్ ప్రకటించిన రోజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు. అతను కూడా సోషల్ మీడియాలో గ్రీట్ చేసిన అందరికీ రిప్లై ఇచ్చాడు. మూడు రోజుల పాటు సాగిన ఈ తంతుకు బ్రేక్ ఇచ్చాడు బన్నీ.

ఇవాళ్టి(సోమవారం) నుంచి మళ్లీ పుష్ప ది రూల్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సెకండ్ పార్ట్ పై ఇప్పుడు మరింత హైప్ వచ్చింది. బన్నీకి నేషనల్ అవార్డ్ తర్వాత ఈ మూవీ క్రేజ్ కూడా డబుల్ అయింది.

ఫస్ట్ పార్ట్ చూడని వాళ్లు ఇప్పుడు చూస్తున్నారు. ఓటిటిలో కూడా వ్యూస్ పెరిగాయి అని చెబుతున్నారు. అది నచ్చిన వారే కాక.. మిగతా వారు కూడా ఖచ్చితంగా ఈ సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా చూస్తారు. పైగా ఫస్ట్ పార్ట్ ను ముగించిన విధానం కూడా క్యూరియాసిటీని పెంచి ఉంది. అందుకే పుష్ప ది రూల్ కోసం ఈగర్ గా చూస్తున్నవారు చాలామందే ఉన్నారు.


ఇక ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికి అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. సినిమా రిలీజ్ డేట్ మాత్రం అదే అని అంతా చెబుతున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా మరో చిన్న గ్లింప్స్ తో త్వరలోనే చెప్పబోతున్నారు. మొత్తంగా అల్లు అర్జున్ తన సెలబ్రేషన్స్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోకుండా వెంటనే షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. మరి ఇలా కష్టపడితేనే వీరు అనుకున్న డేట్ కు సినిమాను విడుదల చేయగలుగుతారు.

Related Posts