‘గామి’ ట్రైలర్.. సరికొత్త పాయింట్ తో వస్తోన్న విశ్వక్ సేన్

ప్రచారంలోకి ఆలస్యంగా దిగినా అందరిలోనూ ఆసక్తిని కనబర్చడంలో మాత్రం సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది ‘గామి’ చిత్రం. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజయ్యింది. ఈ సినిమాలో హ్యూమన్ టచ్ పడని అఘోరాగా గా విభిన్నతరహా పాత్రలో విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు. ఒకవైపు అఘోరాలు.. మరోవైవు దేవదాసీ వ్యవస్థ.. హిమాలయాలు.. పల్లెటూరు.. ఇలా డిఫరెంట్ లేయర్స్ లో ‘గామి’ ట్రైలర్ ఉంది. ఓవరాల్ గా విజువల్ గ్రాండ్యుయర్ గా 3 నిమిషాల 43 సెకన్ల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకుడు. మార్చి 8న ‘గామి’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts