సెలబ్రిటీ క్రికెట్ సీజన్‌ – 10 తెలుగు వారియర్స్‌ గ్రాండ్ ప్రెస్‌మీట్

మెజార్టీ ప్రజలకు అత్యంత వినోదాన్ని కలిగించేవి సినిమాలు, క్రికెట్‌. ఈ రెండింటి పట్ల విపరీతమైన ఇష్టం చూపిస్తుంటారు. అయితే ఈ రెండింటినీ మిక్స్‌ చేసి అత్యంత ఉత్సాహపూరిత ఈవెంట్‌ కి రంగం సిద్దమైంది. సినీ స్టార్స్‌, క్రికెటర్స్‌ కలిసి సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్ నిర్వహించబోతున్నారు. 1వ తేదీ నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచులు జరుగనున్నాయి. తెలంగాణ టూరిజంలో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ లో భాగమైయింది. ఈ నేపధ్యంలో తెలుగు వారియర్స్ టీమ్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రపంచ నలుమూలల సినీ, క్రీడా అభిమానులను, ప్రేక్షకులని ఈ లీగ్ ద్వారా అలరిస్తున్న ఎనిమిది జట్ల సభ్యులకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు తెలంగాణ పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు.
తెలంగాణా టూరిజం సెలబ్రిటీ క్రికెట్ సీజన్‌ 10 లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు తెలుగు వారియర్స్ టీమ్‌ సభ్యుడు సుధీర్‌ బాబు. సిసిఎల్ పదో సీజన్ ఇది. ఈ పదేళ్ళలో లీగ్ గొప్పగా ఎదిగింది. విష్ణువర్ధన్‌ ఇందూరి గారి థాంక్స్. మార్చి 1, 2 తేదిల్లో మ్యాచులు ఆడుతున్నాం. అందరూ స్టేడియంకు వచ్చి సపోర్ట్ చేయాలన్నారు.
మిగతా సభ్యులు మాట్లాడుతూ .. తెలంగాణా టూరింజకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమ జట్టు విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts