HomeMoviesటాలీవుడ్టైగర్ సాంగ్ కాపీ ట్యూన్ లా ఉందే

టైగర్ సాంగ్ కాపీ ట్యూన్ లా ఉందే

-

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోందీ మూవీ. తమిళ్ మ్యూజీషియన్ జివి ప్రకాష్‌ కుమార్ సంగీతం చేస్తోన్న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ విడుదలైంది. ఇది టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టరైజేషన్ ను తెలియజేసే పాట. మ్యూజిక్ పరంగా ఫస్ట్ సాంగ్ లో పెద్దగా మెరుపులేం కనిపించలేదు. ఈ సెకండ్ సాంగ్ మాత్రం వినగానే కాపీ ట్యూన్ లా అనిపిస్తోంది. అది కూడా తెలుగు పాటలానే ఉండటం విశేషం. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రంలోని ఆకును తింటది మేక అనే పాట సౌండింగ్ లోనే ఈ టైగర్ నాగేశ్వరరావు కొత్త పాట వినిపిస్తోంది. పుష్పకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం చేశాడు. ఇక టైగర్ సాంగ్ లోని సాహిత్యం కూడా ఆ పాటకు దగ్గరగా ఉండటం ఆశ్చర్యం. ఈ కంపేరిజన్ కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ రెండు పాటలను వెంట వెంటనే వింటే మాత్రం దాదాపు కాపీ ట్యూన్ లానే అనిపిస్తుంది.


పుష్పలో
ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. అని ఉంటుంది
టైగర్ లో
అధికారం కోసం మోహమే వీడు
ఐశ్వర్యం కోసం అత్యాశే వీడు..
అని సాగుతుంది. ఈ పాట సౌండింగ్ కూడా పుష్ప పాటకు దగ్గరగానే ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.


కాకపోతే మిగతా పాటలతో మాత్రం ప్రకాష్‌ కుమార్ శైలి కనిపిస్తుంది. ఇన్ స్ట్రుమెంట్స్ నుంచి సౌండింగ్ వరకూ మళ్లీ కొత్తగానే అనిపిస్తుంది. అయితే పాట మొదలవడమే కాపీ ట్యూన్ లా అనిపించడం మాత్రం అతని మైనస్ అనే చెప్పాలి.

ఇవీ చదవండి

English News