‘ఆ ఒక్కటి అడక్కు’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్

అల్లరి నరేష్‌ రూట్‌ మార్చి.. కామెడీకి కాస్త దూరంగా జరిగినంత మాత్రం కామెడీ సినిమాలు చేయడని కాదు.. ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఆ ఒక్కటి అడక్కు అంటూ ఓ కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. అల్లరి నరేష్‌, ఫరియా అబ్ధుల్లా జోడీగా చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మల్లి అంకం డైరెక్షన్‌లో రాబోతున్న మూవీ ఇది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్ రిలీజ్‌ చేసారు.

https://www.youtube.com/watch?v=7rLPmS1Yn3Q


ఓ మేడమ్‌ అంటూ సాగే సాంగ్‌ రిలీజయింది. ఫ్రెష్‌ లుక్‌, క్వాలిటీ విజువల్స్‌తో ఆకట్టుకుంటుందీ సాంగ్‌.
మనసుని హత్తుకునే మెలోడీ నంబర్స్ స్కోర్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన గోపీ సుందర్ ఎనర్జిటిక్ మెలోడీని అందించాడు. లిరిసిస్ట్ భాస్కరభట్ల కథానాయకుడిలోని భావాలను అద్భుతంగా వ్యక్తం చేశారు. అనురాగ్ కులకర్ణి తన ప్లజెంట్ వోకల్స్ తో మ్యాజిక్ చేశాడు. మొత్తంగా, ఈ పాట ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతుంది.

Related Posts