నిజంగా జరిగిన సంఘటనలే ‘గామి’ : డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత

రాబోయే సినిమాలలో మోస్ట్ ఎవెయిటెడ్‌ మూవీ ‘గామి’. చాలా పెద్ద కాన్వాస్‌తో రాబోతున్న మూవీ ఇది. ఐదేళ్ల పాటు సుదీర్ఘంగా షూటింగ్ పూర్తి చేసుకుని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ కాబోతున్న మూవీ ఇది. విశ్వక్‌సేన్, చాందినీ చౌదరి , అభినయ మెయిన్ లీడ్ చేసిన ఈ మూవీ మార్చి 8 న ధియేటర్లలో గొప్ప అనుభూతినివ్వబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విద్యాధర్‌ కాగిత మీడియాతో ముచ్చటించారు.
నిజంగా జరిగిన ఓ సంఘటన నాకు చాలా ఎక్సయిట్ చేసింది. ఆ ఐడియాని రాసిపెట్టుకున్నాను. దీంతో పాటు హిమాలయాల పర్వాతాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలసి ఒక ఆలోచనగా మారాయి. మనకి దొరికిన బడ్జెట్ లో తీసేద్దామనే లోచనతో మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమానిస్టార్ట్ చేశాం. తర్వాత డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ వారు రావడం జరిగింది. నటుల కోసం చూస్తున్నపుడు విశ్వక్ ని అనుకున్నాం. అప్పటికి తన సినిమాలు ఏవీ రాలేదు. రెగ్యులర్ గా ఒక ఆడిషన్స్ లా చేశాం. చాలా ఓపెన్ మైండ్ తో తను ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చాలా పెద్ద అలోచించారన్నారు విద్యాధర్‌.
ఐదేళ్ల పాటు షూటింగ్ అంటే అది డిలే కాదు.. ఒక క్వాలిటీ ఔట్‌పుట్‌ కోసం ఇన్నాళ్లు వేచి చూసామన్నారు. కొత్తగా చేస్తున్నామని భావించాం. కాబట్టి సమయం పట్టిందనే భావన రాలేదు. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి.. విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా కొత్తగా ప్రయత్నించామని భావించామన్నారు.
ట్రైలర్ లో కనిపించిన స్టోరీ లింక్స్ గురించి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. గామి’ సినిమా అంతా ఎంగేజింగ్ గా వుండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో వుంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా వుంటుందన్నారు. గామి అంటే గమ్యాన్ని చేరేవాడు. ఇందులో ప్రధాన పాత్రకు ఒక గమ్యం వుంటుంది. దాన్ని ఎలా చేరాడనేది చాలా ఆసక్తికరంగా వుంటుందన్నారు.కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా కల్పించిన పాత్ర అది. ఫిక్షనల్ క్యారెక్టర్ అన్నారు.


ఇలాంటి కాంప్లెక్స్ సినిమాని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడంలో ఎడిటింగ్ పెద్ద సవాల్‌. చాలా కష్టపడి మంచి ఔట్ పుట్ తెచ్చామన్నారు. యువీ వారు ప్రాజెక్ట్‌లోకి వచ్చాక ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ వచ్చిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పెద్ద స్కేల్‌లో చేసే అవకాశం దక్కిందన్నారు. శంకర్ మహదేవన్ గారు మా సినిమాలో పాట పాడటం ఒక గౌరవంగా భావిస్తానన్నారు.హీరో హీరోయిన్లు చాలా రిస్కీ సీన్లు చేసారు. నేను మా అసిస్టెంట్‌ వారితో పాటే ఉండి మేం కూడా చేసి చూయించామన్నారు డైరెక్టర్‌ విద్యాధర్ కాగిత

Related Posts