అల్లరోడి ‘బచ్చల మల్లి’ కీలక షెడ్యూల్ పూర్తి

అల్లరి నరేష్‌.. కామెడీ జోన్ నుంచి బయటకు వచ్చి కంప్లీట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇంటెన్స్‌ యాక్షన్‌ సబ్జెక్ట్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్‌గా నాసామిరంగ మూవీలో అల్లరోడి పర్‌ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ‘బచ్చల మల్లి’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సోలో బతుకే సో బెటర్‌ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి డైరెక్టర్‌. సామజవరగమనా లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ సినిమాలో అల్లరి నరేష్‌ సరసన అమృత అయ్యర్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మెయిన్ లీడ్ ఆర్టిస్టులంతా పాల్గొన్న కీలక షెడ్యూల్ షూట్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో రూపొందనున్న ‘బచ్చల మల్లి’లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించారు.

Related Posts