మే 1న ‘పుష్ప 2’ ఫస్ట్ సింగిల్ ఫైరింగ్..!

‘పుష్ప 2’ పాటల ప్రభంజనం మొదలవుతోంది. మే 1న ది మోస్ట్ అవైటింగ్ ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది. లేటెస్ట్ గా అందుకు సంబంధించిన ప్రోమో రిలీజయ్యింది. ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే సెకండ్ పార్ట్ లోని టైటిల్ సాంగ్ ను రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హై ఎనర్జీతో కంపోజ్ చేసినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ పాటలో పుష్పరాజ్ స్వాగ్ ఓ రేంజులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పాటను ఎవరు రాశారు? ఎవరు పాడారు? అనే విషయాలు మే 1నే తెలయనున్నాయి.

ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15న ‘పుష్ప 2’ రిలీజ్ కు రెడీ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ పవర్ హౌజ్ ఫహాద్ ఫాజిల్ కి ‘పుష్ప 2’లో స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండబోతుందట. అల్లు అర్జున్, ఫహాద్ మధ్య వచ్చే సన్నివేశాలను సమ్‌థింగ్ స్పెషల్ గా డిజైన్ చేశాడట డైరెక్టర్ సుకుమార్.

Related Posts