ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ‘ఫ్యామిలీ స్టార్’

‘గీత గోవింతం’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు ముస్తాబవుతోంది. విజయ్ దేవరకొండకి జోడీగా లక్కీ ఛార్మ్ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఈ చిత్రం విడుదలకు ఇంక కేవలం నెల రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్, ‘నందనందనా’ లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ కి టైమ్ ఫిక్సయ్యింది.

ఈ సినిమా టీజర్ ను మార్చి 4న సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇండియా వైడ్ ట్రెండింగ్ గా మారింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

Related Posts