హనుమాన్ 50 రోజుల వేడుక

సినిమాలో కంటెంట్ ఉంటే.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు.. చిన్న హీరోనా, స్టార్‌ హీరోనా అని చూడరు. సినిమా థ్రిల్లిస్తే చాలు ఆడియెన్స్‌ బ్లాక్‌బస్టర్‌ ఇస్తారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ హనుమాన్‌. సంక్రాంతి కానుకగా వచ్చి అద్దిరిపోయే హిట్ కొట్టింది. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించింది. అప్పుడెప్పుడో 100 రోజులు, 50 రోజుల పండగ చూసేవాళ్లం.. ఇప్పుడంతా మూడు వారాల్లోనే కలెక్షన్ల ప్రాతిపదికన సినిమాలొస్తున్నాయి. మళ్లీ 50 రోజుల వేడుకను పరిచయం చేసింది హనుమాన్‌. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించిన తొలి ఇండియన్‌ సూపర్‌హీరో సినిమా హనుమాన్‌కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. జెన్యూన్‌ హిట్‌ జనం నీరాజనం పలికారు. ఈ సినిమా 50 రోజుల వేడుకను హైదరాబాద్‌ లో నిర్వహించారు.


తను మొదట డైరెక్ట్ చేసిన ‘అ’ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. కమర్షియల్ గా కూడా సక్సెస్సే. కానీ వేడుక చేయకపోవడంతో ఆ సినిమా డబ్బులు తెచ్చిపెట్టలేదనుకున్నారు.. కానీ అది నిజం కాదు.. హనుమాన్‌ కి మాత్రం ఖచ్చితంగా వేడుక చేయాలనిపించింది. 50 రోజులు 150 ధియేటర్లలో ఆడిందంటే.. మళ్లీ ఆనాటి వేడకలకు ఊపిరి పోసింది హనుమాన్‌ అన్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ. ఈ సినిమాలో ఆఖరి ఐదు నిమిషాలు ఎంత థ్రిల్లిచ్చాయి.. రాబోయే జై హనుమాన్‌లో ఆ థ్రిల్ సినిమా అంతా ఉండబోతుందన్నారు.

హనుమాన్‌కి రీమాస్టర్‌ వెర్షన్‌ ఓ అద్భుతం, ఇంటర్నేషనల్ రిలీజ్‌ కూడా చేయబోతున్నామన్నారు ప్రశాంత్‌వర్మ. ఈ సినిమా హిట్‌కి మేం రుణపడిపోయాం.. ఆ రుణాన్ని జై హనుమాన్‌తో తీర్చుకుంటామన్నారు ప్రశాంత్‌ వర్మ.


ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు హీరో తేజ సజ్జా.
చాలా రోజుల తర్వాత 50 రోజుల పండగ హనుమాన్ సినిమాతో జరుపుకోవడం చాలా అనందంగా వుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సినిమానే ఇంత పడ్డ విజయం సాధించడం సంతోషంగా వుంది. ఇది కేవలం ఒక శాతం మాత్రం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇంకా అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయన్నారు నిర్మాత నిరంజన్‌ రెడ్డి.


హనుమాన్‌ 50 రోజుల వేడుకలో నటీనటులు టెక్నిషియన్స్‌ అంతా పాల్గొన్నారు.

Related Posts