రామ్ చరణ్-బుచ్చిబాబు కలయికలో రూపొందుతోన్న ‘ఆర్.సి.16’ గురించి మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి లెజెండరీ ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రెహమాన్ చేస్తున్న సినిమా ఇది. ఇక.. ఇటీవలే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది.
అయితే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ఏ.ఆర్.రెహమాన్ ‘ఆర్.సి.16’ కోసం అప్పుడే మూడు అద్భుతమైన పాటలను అందించాడట. ఇదే విషయాన్ని ఇటీవల చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో తెలిపాడు డైరెక్టర్ బుచ్చిబాబు. రెహమాన్ గారు ఈ సినిమాకోసం ఇచ్చిన పాటలు అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘ఆర్.సి.16’ గురించి బుచ్చిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.