గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘దేవర’

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’గా దసరా బరిలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ వేసవిలోనే ‘దేవర’ విడుదల కావాల్సి ఉంది. అయితే.. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇక.. లేటెస్ట్ గా గోవాలో ఓ కీలక షెడ్యూల్ పూర్తిచేసుకుంది ‘దేవర’. అక్కడ కొన్ని సీన్స్ తో పాటు ఒక మాంటేజ్ సాంగ్ ను చిత్రీకరించాడట డైరెక్టర్ కొరటాల శివ. ఏప్రిల్ నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. హైదరాబాద్ షెడ్యూల్ తో దాదాపు ‘దేవర’ టాకీ పార్ట్ పూర్తికానున్నట్టు తెలుస్తోంది. అనిరుధ్ స్వరాలు అందిస్తున్న ‘దేవర’ నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించనున్నారట మేకర్స్.

రెండు భాగాలుగా రెడీ అవుతున్న ‘దేవర’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనువిందు చేయబోతున్నాడు. ఇంకా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో వంటి నటులు ఈ చిత్రంలో ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ‘దేవర’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts