‘దసరా’ కాంబో మళ్లీ రిపీటయ్యింది.. ఈసారి అంతకుమించి

నాని కెరీర్ లో ‘దసరా’ చిత్రానిది ప్రత్యేక స్థానం. నేచురల్ స్టార్ నుంచి వచ్చిన ఊర మాస్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమా ఆద్యంతం గుబురు గడ్డంతో, లుంగీతో రగ్గడ్ లుక్ లో ధరణి పాత్రలో అదరగొట్టాడు నాని. ఇక.. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత నాని ది. ‘దసరా’ చిత్రంతో గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే వంద కోట్ల మార్కును అందుకున్నాడు శ్రీకాంత్ ఓదెల.

లేటెస్ట్ గా ‘దసరా’ కాంబో మళ్లీ రిపీట్ అవుతున్నట్టు ప్రకటించారు మేకర్స్. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో పాటు.. నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి. సినిమాస్ కూడా మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ‘దసరా’ చిత్రం విడుదలై సంవత్సరం పూర్తైన సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. నాని 33వ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఇక.. కంటెంట్ విషయానికొస్తే.. ‘దసరా’కి మించి అన్నట్టుగా ఈ కొత్త సినిమా ఉండబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ‘నాయకుడిగా ఉండేందుకు గుర్తింపు అవసరం లేదంటూ’ అంటూ ఈ పోస్టర్ లో వేసిన ఇంగ్లీష్ కొటేషన్ ఆకట్టుకుంటుంది.

Related Posts