కల్కిలో దుల్కర్ పాత్రేంటీ

దుల్కర్ సాల్మన్ .. అన్ని భాషల్లోనూ అదరగొడుతున్న హీరో. వైవిధ్యమైన కథలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీస్ లోనూ అదరగొడుతున్నాడు. కొన్నాళ్ల క్రితం మహానటి సినిమాతో తెలుగుకు తెరకు పరిచయం అయ్యాడు. అంతకు ముందే మణిరత్నం ఓకే బంగారం డబ్బింగ్ వెర్షన్ తో ఆకట్టుకున్నాడు. ఇక మహానటిలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని ఆకట్టుకున్న దుల్కర్.. లాస్ట్ ఇయర్ సీతారామంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. త్వరలోనే అతను మళయాలంలో రూపొందిన కింగ్ ఆఫ్ కోతా అనే సినిమాతో వస్తున్నాడు.ఈ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు దుల్కర్.


ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న కల్కి సినిమాలో దుల్కర్ కూడా ఉన్నాడు అన్న వార్తలు ఈ ప్రమోషన్స్ ద్వారా తెలిశాయి. ఆల్రెడీ కమల్ హాసన్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ కు ఇంటర్నేషనల్ లెవల్లో ఓ వెయిట్ వచ్చింది. ఇప్పుడు దుల్కర్ వల్ల మరో మాస్ అప్పీరియన్స్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో తను ఉన్నాను అన్న విషయాన్ని దుల్కర్ అఫీషియల్ గా కన్ఫార్మ్ చేయలేదు.

కానీ నాగ్ అశ్విన్ విజన్ గురిచి గొప్పగా చెబుతున్నాడు. తను సెట్స్ లోకి వెళ్లానని.. నాగీ(దర్శకుడు) మాత్రమే ఇలాంటి విజన్ తో ఉంటాడన్నాడు. అలాగే తను ఎవరి కాంబినేషన్ లో నటించాడు అన్న విషయాన్ని కూడా దాట వేశాడు తప్ప చేయడం లేదు అనలేదు. సో.. ఈ మూవీలో దుల్కర్ సాల్మన్ ఉన్నాడు అని ఖచ్చితంగా తేలిపోయింది. కాకపోతే మేకర్స్ ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకూ ఆగాలని చెప్పారట. ఇక నాగ్ అశ్విన్ సెకండ్ మూవీ మహానటి దుల్కర్ తో చేసిందే కావడంతో వీరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది.

Related Posts