నిఖిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలైంది..

కొన్నాళ్లుగా మంచి విజయాలు చూస్తున్నాడు నిఖిల్. కార్తికేయ తర్వాత అతని ఫేట్ మారిందని చెప్పాలి. మధ్యలో కొన్ని ఫ్లాపులు ఉన్నా.. ఈ మూవీ తర్వాత అతని జర్నీ కొత్తగా మొదలైంది. లుక్ నుంచి మేకోవర్ కూడా మారింది. ఇక ఇదే చిత్రానికి సీక్వెల్ గా చేసిన కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన స్పై బాక్సాఫీస్ వద్ద పోయినా.. ఓటిటిలో ఆకట్టుకుంటోందని చెబుతున్నారు.


కొన్నాళ్లుగా టాలీవుడ్ లో హిస్టారికల్, పీరియాడిక్ మూవీస్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో నిఖిల్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటి హిస్టారికల్ ఫిక్షనల్ మూవీకి ఓకే చెప్పి ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి.. డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి స్వయంభూ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించబోతున్నారు.అలాగే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే రూపొందించి అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు.


సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి టెక్నికల్ సపోర్ట్ గ్రాండ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమ హంస, మ్యూజిక్ కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ చేస్తున్నాడు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే నిఖిల్ ఓ పోరాట యోధుడుగా కనిపిస్తున్నాడు. యుద్ధ రంగంలో గుర్రంపై వెళుతూ గురి చూసి బాణం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది ఈ ఫోటో. ఈ లుక్ బావుంది.స్పై తో కాస్త డల్ అయిన నిఖిల్ కు ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో..

Related Posts