సీనియర్ బ్యూటీతో శ్రీ విష్ణు రొమాన్స్

డిఫరెంట్ స్టోరీస్ అంటే ముందుండే హీరోల్లో శ్రీ విష్ణు. ఈ తరహా సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడూ మాస్ హీరో అంటూ ట్రాక్ తప్పితే ఆడియన్స్ మొట్టికాయలు వేశారు. రీసెంట్ గా మళ్లీ తన ఇమేజ్ కు తగ్గ కథతో చేసిన సామజవరగమనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. తన కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ మూవీ తర్వాత తను అంతకు ముందు విజయం సాధించిన రాజ రాజచోరకు ప్రీక్వెల్ చేస్తున్నాడు. అంటే ఈ మూవీలో జరిగిన కథకు ముందు అతని జీవితంలో ఏం జరిగింది అనేది ఈ ప్రీక్వెల్ ఓ చూపిస్తారన్నమాట. ఈ సినిమాకు స్వాగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ చిత్రంలో రీతూవర్మను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు కూడా చోటుంది. ఆ సెకండ్ బ్యూటీగా సీనియర్ భామ మీరా జాస్మిన్ ను తీసుకున్నారు.


మీరా జాస్మిన్ ఒకప్పుడు సినిమాల్లో చాలా పద్ధతైన పాత్రలు చేసింది. పెళ్లి, విడాకులు తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి తను చాలా హాట్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో స్కిన్ షో చేస్తూ ఫోటోస్ అప్ లోడ్ చేస్తోంది. ఇవి చూసి ఇప్పటికే తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అఫ్‌ కోర్స్ ఈ కొత్త సినిమాలన్నీ తన పాత ఇమేజ్ కు తగ్గట్టుగా పద్ధతిగా ఉన్నవే. రీసెంట్ గా తెలుగులోనూ విమానం అనే సినిమాలో ఎయిర్ హోస్టెస్ గా నటిస్తోంది.

తనను ఈ స్వాగ్ లో తీసుకున్నారు. స్వాగ్ లో మీరా జాస్మిన్ కూడా ఓ హీరోయిన్ అంటున్నారు. అంటే కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయి ఉండగా ఈ సీనియర్ భామతో ఎఫైర్ పెట్టుకుంటాడన్నమాట. తీరా తన ప్రేమ విషయం తెలిసిన ఆమె అతనిపై రివర్స్ అవుతుంది. అతని లైఫ్‌ లో విలన్ గా మారుతుందట. ఇదే పాయింట్ అని కాదు కానీ దాదాపు ఇదీ పాయింట్ అంటుటన్నారు. మరి ఈ సీనియర్ బ్యూటీతో శ్రీ విష్ణు రొమాన్సాయణం ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts