దేవ్ గిల్ హీరోగా ‘అహో! విక్రమార్క’

ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మగధీర‘తో విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు దేవ్ గిల్. ఆ తర్వాత ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో అలరించిన దేవ్ గిల్.. ఇప్పుడు హీరోగా మారాడు. తానే సొంతంగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి.. ‘అహో! విక్రమార్క’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రానికి రాజమౌళి దగ్గర పలు చిత్రాలకు పనిచేసిన పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ గా ‘అహో! విక్రమార్క’ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇటీవల ‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లోని డాంగే రోడ్‌లో ఎంతో ఘనంగా జరిగింది. భారీ తారాగణంతో రానున్న ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని హీరో దేవ్ గిల్ చెప్పాడు. ‘అహో! విక్రమార్క’తో పోలీసుల ధైర్యాన్ని, అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము‘ అని దేవ్ గిల్ అన్నాడు. ఈ చిత్రంలో సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘కె.జి.యఫ్, సలార్‘ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్.

Related Posts