తల్లి పేరు మీద బ్యానర్ స్థాపించిన సాయిధరమ్

ఉమెన్స్ డే సందర్భంగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తన తల్లికి అరుదైన బహుమతులు ఇచ్చాడు. ప్రతీ ఒక్కరి పేరులో తండ్రి పేరు ఇంటి పేరుతో కలిసి ఉంటుంది. అయితే తన తల్లి తన జీవితంలో భాగం కావాలని ఆమె పేరును తన పేరులో కలుపుకున్నాడు. ఇకపై సాయిధరమ్ తేజ్ కాస్తా సాయిదుర్గా తేజ్ గా మార్చుకుంటున్నానని చెప్పాడు. అలాగే.. మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లి విజయ్ దుర్గ పేరుతో విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ స్థాపించాడు.

తన జీవితంలో ఇది కొత్త ఆరంభం అని.. తన తల్లికి చిన్న గిఫ్ట్ అంటూ విజయ్ దుర్గ ప్రొడక్షన్ బ్యానర్ ను స్థాపిస్తున్నట్టు సోషల్ మీడియాలో తెలిపాడు. ఈ సందర్భంగా.. ‘ఈ శుభకార్యాన్ని నా శ్రేయస్సును ఆకాక్షించే మా మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, నా గురువు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నా కెరీర్‌కు ఆరంభంలో సపోర్ట్ చేసి దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. నా స్నేహితుడు రూపొందించిన ‘సత్య‘ సినిమా లాంఛ్ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం హ్యాపీగా ఉందని తన పోస్ట్ లో తెలిపాడు సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయిదుర్గా తేజ్.

Related Posts