స్కంద సాంగ్ .. కల్ట్ కల్ట్ కల్ట్..

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్ లానే కనిపించింది. శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఆల్రెడీ టేబిల్ ప్రాఫిట్ మూవీ అనిపించుకున్న స్కంద నుంచి లేటెస్ట్ గా ఓ ఐటమ్ సాంగ్ విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఈ పాటలో రామ్ తో పాటు ఊర్వశీ రౌతేలా నర్తించింది.

ఇప్పటి వరకూ వచ్చిన పాటలతో పోలిస్తే ఇది కాస్త మాసివ్ గా ఉందని చెప్పాలి. ఇది హీరో క్యారెక్టరైజేషన్ ను తెలియజేసే పాటలా ఉంది. అందుకే థమన్ కాస్త ఎక్కువ ఫోకస్ చేశాడు. పాటలోని సాహిత్యం తో పాటు సంగీతం కూడా ఊరమాస్ ఆడియన్స్ టార్గెట్ గానే ఉంది.


“మెడకు కర్చీఫ్‌ తలకు రిబ్బన్ కట్టేసి నించున్న కటౌట్ కల్ట్.. సైలెన్సర్ పీకేసి యాక్సలేటర్ ని రైయ్ అంటూ తిప్పేసే కటింగ్ కల్ట్.. దందా కోసం పెట్టే సిట్టింగ్ కల్ట్.. వందమందితోనే బెట్టింగ్ కల్ట్.. మిడ్ నైట్ మోగించే డిజే బీట్ కల్ట్.. స్కెచ్ గీస్తే కల్ట్.. రచ్చ చేస్తే కల్ట్.. ఇస్మైల్ కల్ట్, ఇస్టైల్ కల్ట్, ఇస్కూల్ కల్ట్.. కల్ట్ కల్ట్.. ” అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీ రామ్ రాశాడు. హేమ చంద్ర, రమ్య బెహ్రా, మహా పాడారు. సో.. ఈ లిరిక్స్ చూస్తుంటే ఈ హీరో కల్ట్ అంటే పడిచచ్చిపోతాడని అర్థం అవుతుంది. ఏదేమైన పండగ పూట ఓ ప్లెజెంట్ సాంగ్ కాకుండా ఈ హడావిడీ పాట విడుదల చేయడం చూస్తేనే అర్తం అవుతుంది. ఈ వినాయక చవితి మండపాల్లో కల్ట్ పాట మోగిపోవడానికే అని..

Related Posts