ముల్లోక వీరుడుగా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మొదట పట్టించుకోలేదు కానీ.. భోళా శంకర్ డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పాలి. అందుకే కేవలం తన పాత ఇమేజ్ మీదే షో రన్ చేస్తాం అనే దర్శకులకు గ్యాప్ ఇస్తున్నాడు. అలా ఆల్రెడీ కమిట్ అయిన కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్ లో కమిట్ అయిన సినిమాను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ దీని తర్వాత కమిట్ అయిన వశిష్ట సినిమా పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. హీరోయిన్ గా అనుష్కను తీసుకున్నట్టే అంటున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.


ఇంతకు ముందు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు మెగాస్టార్. ఈ కథ కూడా ఆ తరహాలోనే సోషియో ఫాంటసీగా రూపొందబోతోందట. ఆల్రెడీ ఈ జానర్ లో వశిష్ట .. బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అందుకే చిరంజీవి అతన్ని నమ్మాడు. అయితే ఇది మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అంటున్నారు. అంటే చిరంజీవి ముల్లోక వీరుడుగా కనిపిస్తాడా అంటున్నారు కొందరు. ఆ విషయం అప్పుడే చెప్పలేం కానీ.. ఈ మూడు లోకాలకు తగ్గట్టుగా ముగ్గురు హీరోయిన్లు కూడా అవసరం ఉంటారట. అంటే ముల్లోక వీరుడు.. ముగ్గురు అతిలోక సుందరులు అన్నమాట.

ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవి సినిమాకు సంగీతం చేయబోతున్నాడు కీరవాణి. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నాడు. ఇతర కాస్ట్ అండ్ క్రూను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.


ఇంతకు ముందు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు మెగాస్టార్. ఈ కథ కూడా ఆ తరహాలోనే సోషియో ఫాంటసీగా రూపొందబోతోందట. ఆల్రెడీ ఈ జానర్ లో వశిష్ట .. బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అందుకే చిరంజీవి అతన్ని నమ్మాడు. అయితే ఇది మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అంటున్నారు. అంటే చిరంజీవి ముల్లోక వీరుడుగా కనిపిస్తాడా అంటున్నారు కొందరు. ఆ విషయం అప్పుడే చెప్పలేం కానీ.. ఈ మూడు లోకాలకు తగ్గట్టుగా ముగ్గురు హీరోయిన్లు కూడా అవసరం ఉంటారట. అంటే ముల్లోక వీరుడు.. ముగ్గురు అతిలోక సుందరులు అన్నమాట. ఇక ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు. ఇతర కాస్ట్ అండ్ క్రూను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.

Related Posts