‘విక్రమార్కుడు 2’ గురించి క్రేజీ అప్డేట్

మాస్ మహారాజ రవితేజ చిత్రాల్లో ‘విక్రమార్కుడు’ది ప్రత్యేక స్థానం. 2006లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఒకవిధంగా చెప్పాలంటే రాజమౌళి నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా ఇది. అందుకు ప్రత్యేక కారణం ఈ మూవీ సెటప్. ఈ సినిమా కథంతా మధ్యప్రదేశ్ లోని చంబల్ ఏరియా చుట్టూ సాగుతోంది. అందుకే.. ఈ చిత్రాన్ని ఆ తర్వాత తమిళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో కార్తీ ‘సిరుత్తై’గా రీమేక్ చేసి ఘన విజయాన్ని సాధిస్తే.. హిందీలో అక్షయ్ కుమార్ ‘రౌడీ రాథోర్’గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

‘విక్రమార్కుడు’ సినిమాకి చాన్నాళ్ల క్రితమే సీక్వెల్ స్టోరీ మొదలుపెట్టారు లెజెండరీ రైటర్ విజయేంద్రప్రసాద్. అయితే.. ఈ సీక్వెల్ ని రాజమౌళి తెరకెక్కించడు అని ఆయన అప్పట్లోనే తెలిపారు. అలాగే ‘విక్రమార్కుడు 2’ కథను ‘భీమా’ నిర్మాత కె.కె.రాధామోహన్ కి ఇచ్చారట. అతనేమో ఈ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. రవితేజా నుంచి ఇంకా ‘విక్రమార్కుడు 2’కి గ్రీన్ సిగ్నల్ రాలేదట. మాస్ మహారాజ నుంచి అంగీకారం వచ్చేస్తే త్వరలోనే ‘విక్రమార్కుడు 2’ని మొదలుపెట్టనున్నారట నిర్మాత కె.కె.రాధామోహన్.

Related Posts