కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో ఐశ్వర్య అనుబంధం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదలైంది. ఇక.. ఈ వేడుకతో లాంగ్ అసోసియేషన్ ఉన్న ఇండియన్ సెలబ్రిటీ ఐశ్వర్య రాయ్. ఈ ఏడాదితో కలిపి ఐశ్వర్య ఈ వేడుకలో 21 సార్లు పాల్గొందంటే ఆశ్చర్యం కలగక మానదు. చేయి విరిగి అసౌకర్యంగా అనిపించినా.. కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొనడం మాత్రం మానలేదు ఐశ్వర్య. తన కూతురు ఆరాధ్య తో కలిసి కేన్స్ లో సందడి చేస్తోంది ఈ మాజీ విశ్వసుందరి.

ఫ్రాన్స్ లో దిగిన వెంటనే ఐశ్వర్య, ఆరాధ్య లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇక.. లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా రెడ్ కార్పెట్ పై మెరిసిన ఐశ్వర్య.. ఈసారి కూడా కళ్లు మిరుమిట్లు గొలిపే అవుట్‌ఫిట్ తో అదరగొట్టింది. నలుపు-తెలుపు వర్ణపు గౌను ధరించి రెడ్ కార్పెట్ లో మెరిసింది. ఆమె అవుట్‌ ఫిట్ వెనుక గోల్డెన్ కలర్ బటర్ ఫ్లైస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే.. ఆమె చేయికి తగిలిన గాయం కారణంగా కుడి చేతిలో ప్లాస్టర్ కనిపిస్తుంది.

Related Posts