సాయి పల్లవి తప్పించుకుంది

ఈ జెనరేషన్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు సాయి పల్లవి. ఫస్ట్ మూవీ నుంచే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తూ వస్తోన్న ఈ బ్యూటీ విరాటపర్వం తర్వాత తెలుగులో గ్యాప్ తీసుకుంది. తీసుకుందా వచ్చిందా అంటే చెప్పలేం.. బట్ విరాటపర్వం తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. ఈ మధ్య లో చాలామంది దర్శకులు తనకు కథలు చెప్పిన మాట వాస్తవం. అయినా తను యస్ చెప్పలేదు.

రీసెంట్ గా హిమాలయాస్, కేదార్ నాథ్ యాత్రలకు కుటుంబంతో కలిసి వెళ్లి వచ్చింది సాయి పల్లవి.రీసెంట్ గా శివకార్తికేయన్ సరసన తమిళ్ లో ఓ మూవీకి ఓకే చెప్పిందన్న వార్తలు వచ్చాయి. అయితే తను సినిమాలు చేయకపోయినా ఓ పెద్ద గండం నుంచి మాత్రం తప్పించుకుంది.


సాయి పల్లవి సినిమాలు హిట్ కాకపోయినా నటన పరంగా తను ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. పైగా ఏ సినిమాలో ఉంటే తనే ఆ సినిమాకు హైలెట్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో తను భోళా శంకర్ ప్రమాదం నుంచి బయటపడిన విషయాన్ని నెటిజన్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి భోళా శంకర్ తో సాయి పల్లవిని తీసుకోవాలని మూవీ టీమ్ శతవిధాలా ప్రయత్నించింది. తను కథ విన్నది. చేయను అని చెప్పింది. అయినా టీమ్ తనకోసం చూసింది. సాయి పల్లవి మాత్రం ససేమిరా ఈ చిత్రం చేయను అని చెప్పింది.తను ఊహించినట్టుగానే ఈ సినిమా డిజాస్టర్ అయింది. అఫ్ కోర్స్ డిజాస్టర్ అవుతుందని ఊహించింది అనడం కరెక్ట్ కాదు. తనకు నచ్చలేదు. చేయలేదు అంతే.


సాయి పల్లవి కాదు అన్న తర్వాతే కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యిందన్నమాట. అయితే కీర్తి సురేష్ కు తెలుగులో స్టోరీ సెలెక్షన్ పై గట్టి పట్టు లేదు అన్నది ముందు నుంచీ కనిపిస్తున్నదే. అందుకే తనది రాంగ్ చాయిస్ అని మరోసారి ప్రూవ్ అయింది. సో.. సాయి పల్లవి తప్పించుకుంటే కీర్తి సురేష్ బుక్ అయిందన్నమాట.

Related Posts