థియేటర్ల మూసివేత మా దృష్టికి రాలేదు.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్

ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రెస్ నోట్ జారీ చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసివేస్తున్నట్టు వస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తమ ప్రెస్ నోట్ లో తెలిపింది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియాలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుండి ఏ గ్రూప్ గాని సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని మేము పునరుద్ఘాటిస్తున్నామని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది.

Related Posts