‘కల్కి’ రిలీజ్ డేట్ పై ఈరోజే క్లారిటీ..!

రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగా కలవరపెడుతోన్న ‘కల్కి’ కొత్త రిలీజ్ డేట్ పై ఈరోజే క్లారిటీ రాబోతుంది. ‘కల్కి’ నుంచి ఈరోజు (ఏప్రిల్ 21) సాయంత్రం 7.15 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ ఇండియా లో ఈ సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ అప్డేట్ అందించబోతుందట చిత్రబృందం. అందుకు సంబంధించి ‘సమయం వచ్చింది’ అంటూ ఓ ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఫోటోతో విడుదల చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈరోజే ‘కల్కి’ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ.. ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయనుందట టీమ్.

Related Posts