చోటా కె నాయుడు కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన హరీష్ శంకర్..!

సినిమా అంటేనే సమిష్టి కృషి. 24 విభాగాలకు సంబంధించిన వ్యక్తులు కలిసి పనిచేస్తేనే సినిమా బయటకు వస్తోంది. అలాంటి సందర్భాల్లో వివిధ శాఖలకు సంబంధించిన వ్యక్తుల మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు వస్తుంటాయి. ఈకోవలోనే.. ఎన్టీఆర్ ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాకి సంబంధించి డైరెక్టర్ హరీష్ శంకర్ పై కొన్ని కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశాడు ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు.

‘రామయ్య వస్తావయ్యా’ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ విషయంలో తాను ఇచ్చిన సలహాలను, సూచనలను హరీష్ శంకర్ పట్టించుకోలేదనే విధంగా చోటా కె.నాయుడు కామెంట్స్ చేశారు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందనే రీతిలో చోటా చేసిన కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఓ ఓపెన్ లెటర్ ను రిలీజ్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

‘వయసులో పెద్ద కాబట్టి.. గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ అని సంబోధిస్తూ.. చోటా కె. నాయుడుకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ‘రామయ్య వస్తావయ్య’ సినిమా వచ్చి దశాబ్దం దాటిందని.. ఈ పదేళ్లలో నేను కూడా చాలా ఇంటర్యూలు ఇచ్చాను కానీ.. నీ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. కానీ.. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు’ అంటూ తన ఓపెన్ లెటర్ లో పేర్కొన్నాడు హరీష్ శంకర్.

‘మీరు మాత్రం ఇంటర్యూ చేసే వ్యక్తి అడగకపోయినా.. నా ప్రస్తావన రాకున్నా.. నాకు సంబంధం లేకున్నా.. నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.. ఇలా చాలాసార్లు జరిగినా.. నేను మౌనంగానే బాధపడ్డా.. కానీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే ఎనీ టైమ్.. ఎనీ ప్లాట్‌ఫామ్.. ఐయామ్ వెయిటింగ్’ అంటూ హరీష్ శంకర్.. చోటా కె.నాయుడుకి చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్ అవుతోంది.

Related Posts