‘దేవకి నందన వాసుదేవ’ నుంచి రొమాంటిక్ మెలోడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న రెండో చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. తొలి సినిమా ‘హీరో’తో హీరో మెటీరియల్ అనిపించుకున్న అశోక్.. ఇప్పుడు ‘దేవకి నందన వాసుదేవ’తో విజయాన్ని సాధించడానికి రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ కథతో.. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ మూవీ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్న ‘దేవకి నందన వాసుదేవ’ నుంచి ‘ఏమయ్యిందే’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ రిలీజయ్యింది. సురేష్ గంగుల రచనలో ఈశ్వర్ దత్తు ఈ పాటను ఆలపించారు. హీరో అశోక్ గల్లా, హీరోయిన్ మానస వారణాసి మధ్య చిత్రీకరించిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Related Posts