భయపెట్టడానికి వస్తోన్న భరత్ ‘మిరల్’

‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘మిరల్’. ‘స్కేర్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. భరత్ కి జంటగా వాణి భోజన్ నటించిన ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎమ్.శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా.. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

భార్యాభర్తలు భరత్, వాణి భోజన్.. తమ కుమారుడితో కలిసి కారులో ఎక్కడికో ప్రయాణించడం.. ఆ దారిలో వారికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.హెచ్.సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

Related Posts