చరణ్ హీరోయిన్ ఎంపిక వెనుక చిరు హస్తం

రామ్ చరణ్ ను మెగాపవర్ స్టార్ గా తీర్చిదిద్దడంలో మెగాస్టార్ తీసుకున్న శ్రద్దాసక్తులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చరణ్ తొలి సినిమాల కథల విషయంలోనే కాదు.. ఇప్పటికీ రామ్ చరణ్ కు సంబంధించిన సినిమాల ఎంపికలో చిరు హస్తం ఉంటూనే ఉంటుంది. చిరంజీవి.. నాలుగున్నర దశాబ్దాల సినీ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ఎంతోమంది హీరోలు, నిర్మాత దర్శకులు తాపత్రయ పడుతుంటారు. ఆయన అనుభవంతో ఇచ్చిన సలహాలను ప్రేమగా స్వీకరిస్తుంటారు.

ఇక.. బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలోని హీరోయిన్ ఎంపిక విషయంలో చిరు హస్తం కూడా ఉందట. చరణ్ సినిమాల కథలను చిరంజీవి ప్రత్యేకంగా వింటుంటారు. ఈకోవలోనే బుచ్చిబాబు.. చరణ్ తో చేయబోయే సినిమా కథకు హీరోయిన్ గా జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని చిరు సలహా ఇచ్చారట. మెగాస్టార్ మాట ప్రకారమే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంచుకుందట టీమ్.

మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. రామ్ చరణ్ తోనే ఉంటుందని చాన్నాళ్లుగా ప్రచారమైంది. అది కూడా చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రీమేక్ తో ఉంటుందని అనుకున్నారు. ఈ మూవీ సీక్వెల్ ను వైజయంతీ అధినేత అశ్వనీదత్ తీయడానికి సంకల్పించారు కూడా. అయితే.. కథ సెట్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఏదేమైనా ఎన్టీఆర్ ‘దేవర’తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్.. రామ్ చరణ్ తో తన రెండో సినిమాని చేయబోతుంది

Related Posts