HomeMoviesటాలీవుడ్'గామి' గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్

‘గామి’ గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్

-

మాస్‌కా దాస్ విశ్వక్‌సేన్ మెయిన్ లీడ్ చేసిన మూవీ ‘గామి’ . మానవ స్పర్శ అనుభవించలేని అరుదైన సమస్యతో బాధపడే అఘోరాగా విశ్వక్‌సేన్ నటించిన మూవీ ఇది. ఈ సినిమాలో చాందినిచౌదరి, అభినయ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను కార్తీక్ శబరీష్ నిర్మాణంలో విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో మార్చి 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు చిత్ర యూనిట్‌.


ఈ వేడుకకు అడివిశేష్‌ హాజరయ్యారు. గూఢచారి మూవీ టెస్ట్ స్క్రీన్‌ చేస్తుంటే దినేష్‌ ప్రసాద్‌ అనే యువకుడు వచ్చి బాగా చేసావ్ అని చెప్పి వెళ్లిపోయాడు.. ఎవర్రా వీడు అనుకున్నా.. ఆరోజు కళ్లజోడు పెట్టుకుని వచ్చినా ఆ దినేష్‌ ప్రసాదే.. ఈ విశ్వక్‌సేన్ అన్నాడు అడవి శేష్‌. విశ్వక్‌ నిజాయితీ గల నటుడన్నారు. అతని నిజాయితీ వల్లే ఈ వేడుకకు వచ్చానన్నారు అడవి శేష్‌.
ఈ వేడుకకు వచ్చి సినిమా విజయాన్ని కాంక్షించిన అడవి శేష్‌, హను రాఘవపూడి, అజయ్‌ అన్నకు థ్యాంక్స్ అన్నారు విశ్వక్‌సేన్‌. ఈ చిత్ర దర్శకుడు విద్యాధర్‌ మాటల్లో నిజాయితీని నమ్మానన్నారు విశ్వక్‌. ఈ సినిమాతో విద్యాధర్‌ మంచి ఫ్రెండయ్యాడన్నారు. విశ్వనాధ్‌ డీఓపీగా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారన్నారు. విక్కీ అన్న ఎంటర్‌ కావడంతో ఈ సినిమా స్కేల్‌ పెరిగింది… నరేష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారన్నారు. ఈ సినిమా కోసం చాలా రిస్క్‌ తీసుకుని చేసామన్నారు. ఆ శివయ్య ఆశీస్సుల కారణంగానే మహాశివరాత్రికి రిలీజ్‌ కాబోతుందన్నారు. ఈ సినిమా ఇంటికి వెళ్లినా వెంటాడే సినిమా ఇది అన్నారు విశ్వక్‌సేన్.
క్రౌడ్ ఫండ్‌ గా మొదలై పెద్ద కాన్వాస్‌తో ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్దమైందన్నారు దర్శకుడు విద్యాధర్ కాగిత. నిర్మాత కార్తీక్ చాలా సపోర్ట్ చేసారన్నారు. ఈ ప్రాజెక్ట్‌ తొలినాళ్లలో మమ్మల్ని నమ్మిన నాగ్‌ అశ్విన్‌ గారికి చాలా థ్యాంక్స్‌ అన్నారు. వీఎఫ్ఎక్స్‌ అద్భుతంగా ఇచ్చారు సునీల్‌.. సమిష్టి కృషితో ఈ సినిమా అద్భుతమైన ఔట్‌పుట్‌ వచ్చిందన్నారు విద్యాధర్‌ కాగిత.


హిమాలయాల్లో ఆక్సిజన్ ట్యాంక్స్ సాయం తీసుకొని మరి ఈ సినిమా షూటింగ్ చేశాం. గామి చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది. విశ్వనాథ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నరేష్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో పని చేసిన అందరూ ది బెస్ట్ ఇచ్చారు. విశ్వక్ వండర్ ఫుల్ యాక్టర్. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతమైన ప్రయాణం అన్నారు హీరోయిన్ చాందినీ చౌదరి.
తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే పిచ్చి. గామి సినిమా యూనిట్ కూడా ఆరేళ్ళు ఒక సినిమా పై కష్టపడం అంటే సినిమాపై వారికి వున్న పిచ్చి ఏమిటో అర్ధమౌతుంది. విశ్వక్ కి సినిమా అంటే చాలా పిచ్చి. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు నవదీప్.

ఇవీ చదవండి

English News