‘ఫలక్‌నుమ దాస్’ డేట్ కే రానున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల ‘గామి’తో డీసెంట్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 17న విడుదలకు ముస్తాబైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా పడింది. మే 31న ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.

మే 31.. విశ్వక్ సేన్ కి బాగా కలిసొచ్చిన తారీఖు. ఐదేళ్ల క్రితం మే 31 నే విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఫలక్‌నుమా దాస్‌’ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే తేదీన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా నేహా శెట్టి నటించింది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించబోతుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. మొత్తంమీద.. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Related Posts