HomeMoviesటాలీవుడ్'మైదాన్' ట్రైలర్.. గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్

‘మైదాన్’ ట్రైలర్.. గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్

-

బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ నటించిన లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘మైదాన్’. బోనీ కపూర్ నిర్మాణంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ ఈద్ కానుకగా ‘మైదాన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ‘మైదాన్’ని విడుదలకు ముస్తాబు చేస్తున్నారు.

1952-62 మధ్య కాలంలో ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కథతో ‘మైదాన్’ తెరకెక్కింది. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌ లో సెమీ ఫైనల్స్‌కి చేరిన ఇండియన్ ఫుట్ ‌బాల్ టీమ్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితకథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్.. సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రియమణి మరో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ‘మైదాన్’ ట్రైలర్ రిలీజయ్యింది. ఆద్యంతం పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది

ఇవీ చదవండి

English News