ఆస్కార్ విజేతల రచన, స్వరకల్పనలో ‘రాయన్’ సాంగ్

విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం ‘రాయన్’. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘రాయన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ స్వరకల్పనలో మరో ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన ‘తలవంచి ఎరగడే’ అంటూ సాగే గీతాన్ని హేమచంద్ర, శరత్ సంతోష్ ఆలపించారు. కథానాయకుడు గొప్పదనాన్ని తెలిపే ఎలివేషన్ సాంగ్ ఇది.లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పాట సినిమాకే హైలైట్ అవుతోందని భావిస్తోంది టీమ్.

కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ఈ మూవీలో ఎస్.జె.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Posts