‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ ‘దేవర’. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న ‘దేవర’ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది టీమ్. అందుకు.. ఈనెలలో వస్తోన్న ఎన్టీఆర్ పుట్టినరోజు వేదిక కాబోతుంది. తారక్ బర్త్ డే స్పెషల్ గా.. ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘దేవర’ టీమ్ తమ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ వస్తున్నట్టు తెలిపింది. అలాగే.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సైతం.. ఆస్ట్రేలియాలో ఇచ్చిన కాన్సెర్ట్ లో ‘దేవర’ సింగిల్ కమింగ్ సూన్ అనే హింట్ ఇచ్చాడు.

‘దేవర’ సినిమాలో యంగ్ టైగర్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో పాటు.. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ కానున్నాయి. ఇక.. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తుండడంతో ఈ చిత్రం పాటలపైనా ఎన్నో అంచనాలున్నాయి. మొత్తంమీద.. ఈ రెండు, మూడు రోజుల్లోనే ‘దేవర’ ఫస్ట్ సింగిల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Posts