ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిన ‘మాయా వన్’ టీజర్

సందీప్ కిషన్ హిట్ మూవీస్ లిస్ట్ లో ‘ప్రాజెక్ట్ జెడ్’ ఒకటి. తమిళంలో సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన ‘మాయవన్’ సినిమాకి ఇది తెలుగు అనువాదం. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ జెడ్’కి సీక్వెల్ గా సి.వి.కుమార్ దర్శకత్వంలోనే ‘మాయా వన్’ పేరుతో సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది. ‘ఒకసారి పురాణాలను దాటి వచ్చి చూస్తే.. తనని తాను దేవుడిగా భావించిన ప్రతి మనిషీ మారింది రాక్షసుడిగా మాత్రమే. అలా రాక్షసుడు పుట్టికొచ్చిన ప్రతిసారీ ఆ దేవుడు పంపేది మొండితనాన్ని ఆయుధంగా మార్చుకుని పోరాడే ఒక సామాన్యుడిని..’ అంటూ మురళీ శర్మ సంభాషణలో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం కళ్లు మిరిమిట్లు గొలిపే విజువల్స్ తో ఆకట్టుకుంటోంది.

ఆద్యంతం సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతోన్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కత్రిన్‌ డేవిసన్‌ హీరోయిన్. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీశర్మ, పృథ్వీరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదలైన గంటల్లోనే ‘మాయా వన్’ టీజర్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది.

Related Posts