దటీజ్ మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నీడలోనే ఇప్పుడున్న మెగా హీరోలంతా ఎదిగారు అనేది నిజం. అల్లు అర్జున్ సైతం మెగా ట్యాగ్ తోనే స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎవరు ఎంత పెద్ద స్టార్ అయ్యారు .. ఎంత పర్సనల్ ఇమేజ్ తెచ్చుకున్నారు అన్నా.. అది కేవలం మెగాస్టార్ చిరంజీవి అండతోనే సాధించినవి. అఫ్‌ కోర్స్ ఒక దశ దాటిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు. ఆ చూసుకోవడం సామరస్యంగా ఉంటే బానే ఉంటుంది. మరీ నేను మాత్రమే అనుకుంటేనే అభిమానుల్లో కూడా వైరుధ్యాలు వస్తాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీకీ, అల్లు అర్జున్ కు మధ్య ఈ గ్యాప్ వచ్చింది అనేది కాదనలేని సత్యం. కానీ మెగాస్టార్ అలాంటివి మనసులో పెట్టుకోడు. అందరూ తన వాళ్లే అనుకుంటాడు.

అందుకే తాజాగా అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డ్ వచ్చిన సందర్భంగా భార్యతో కలిసి ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలియజేశాడు.అయితే ఇంటికి వెళ్లి అభినందిస్తే గొప్పా అనిపించొచ్చు. గొప్పే. ఎందుకంటే రీసెంట్ గానే మెగాస్టార్ కు ఢిల్లీలో సర్జరీ అయింది. అక్కడి నుంచి రాగానే అల్లు అర్జున్ ను కలిసి అభినందించాడు. ఆయన మనసులో ఏదీ ఉండదు అనేందుకు ఇంతకు మించిన నిదర్శనం ఇంకేముంటుందీ.

ఇక బావమరిదే అయినా.. అల్లు అర్జున్ తో ఆయనకు బంధుత్వానికి మించిన స్నేహం ఉంది. అందుకే మధ్యలో వచ్చిన వారు ఎవరెన్ని చేసినా.. చెప్పినా.. వాళ్లు మాత్రం ఎప్పుడూ బాగానే ఉన్నారు.. ఉంటున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ విషయంలో రామ్ చరణ్‌ స్పందన అభిమానులకు నచ్చలేదు. కానీ మెగాస్టార్ మాత్రం దటీజ్ మెగాస్టార్ అని అని మరోసారి అనిపించుకున్నాడు.

Related Posts