రవితేజ వరుసగా రెండు రీమేక్ లు

టాలీవుడ్ లో ఒక్కొక్కప్పుడు ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు రీమేక్ లు చేస్తే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అవే రీమేక్ లు సూపర్ ఫ్లాప్స్ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆ ట్రెండ్ కు కొన్నాళ్లు బ్రేక్ వేస్తారు ఎవరైనా. బట్ మాస్ మహరాజ్ రవితేజ ఆ బ్రేక్ లు పట్టించుకోవడం లేదు. ఈ ఫ్లాపులూ చూడ్డం లేదు. అందుకే వరుసగా ఓ రెండు సినిమాలు రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో మరో మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు అనిపించాడు. పైగా ఇది బయోపిక్ లాంటి స్టోరీ కూడా కావడంతో ఆడియన్స్ లోనూ ఓ రకమైన క్రేజ్ ఉంది. మరోవైపు ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసమే రీసెంట్ గా విదేశాలకు వెళ్లాడు. ఈగల్ సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఒకేసారి మరో రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసి ఉన్నాడు. ఆ రెండూ రీమేక్ లే కావడం విశేషం.


నిజానికి ఇప్పుడు టాలీవుడ్ లో రీమేక్ లు బాగా దెబ్బ కొడుతున్నాయి. అయినా మాస్ రాజా ధైర్యం చేస్తున్నాడు అంటే కారణం.. ఆ రెండు సినిమాలూ తెలుగులో డబ్ కాలేదు. అలాగే ఆ రెండు సినిమాలు తీసే దర్శకులు. వీటిలో మొదటిది బాలీవుడ్ మూవీ రైడ్. 2018లో అజయ్ దేవ్ గణ్ నటించిన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరో ఓ సిన్సియర్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్.

తెలుగులో అప్పట్లోనే రవితేజ తో పాటు మరికొందరు హీరోలు రీమేక్ చేస్తారు అనే టాక్ వచ్చింది. అప్పుడు వర్కవుట్ కాలేదు. బట్ ఇప్పుడు ఓకే అయింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. రీమేక్ సినిమాలను హరీష్‌ శంకర్ డీల్ చేసే విధానం ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. ఆ సినిమాలను తెలుగులోకి పర్ఫెక్ట్ గా అడాప్ట్ చేయ�