చెర్రీ ఫ్యాన్సూ.. కాస్త ఓపికపట్టండి – దిల్ రాజు

జరగండి.. జరగండి.. అంటూ గేమ్‌ ఛేంజర్ నుంచి రిలీజయిన సాంగ్ కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. చెర్రీ, శంకర్, ప్రభుదేవా రేంజ్ సాంగ్ కాదంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఆ సాంగ్ లో మీరు చూసింది రెండు శాతమే… సినిమా చూస్తే మీకే అర్ధమవుతుందంటూ హైప్ పెంచుతున్నాడు దిల్‌రాజు.


చెర్రీ బర్త్‌డే సందర్భంగా శిల్పకళావేదికలో ఈవెంట్ నిర్వహించారు ఫ్యాన్స్. ఈ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొని గేమ్‌ చేంజర్ అప్‌డేట్స్ పై మాట్లాడారు. ఈ సినిమా అప్‌డేట్స్ గురించి నన్ను తిడుతున్నారు.. తిట్టుకోకండన్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగా ఉండాలని శంకర్ అద్భుతంగా చెక్కుతున్నాడన్నారు. అప్‌డేట్స్ నేను ఇచ్చేది కాదు.. పైనుంచి రావాలన్నారు. గ్లోబల్‌స్టార్ రేంజ్‌కు తగ్గట్టు సినిమా ఉంటుంది కాస్త ఓపిక పట్టండన్నారు. ఈ ఏడాది బర్త్ డే రామ్ చరణ్‌కు ఎంతో స్పెషల్.. అతని జీవితంలోకి క్లీంకార వచ్చింది.. నేటి ఉదయమే తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాడు..


గేమ్ చేంజర్ పాట మాస్‌లోకి బాగా వెళ్ళింది.. ఇంకో మూడు రోజులు ఆగితే..ఆ పాట గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటారు.. ఎందుకంటే ఆ సాంగ్ లీకైంది కాబట్టి అలానే అనిపిస్తుంది.. లిరికల్ వీడియోలో విజువల్ ట్రీట్‌తో అంతగా సంతృప్తి చేయలేం.. కానీ థియేటర్లో ఈ పాట పడితే మాత్రం సీట్లలో కూర్చోలేరు అది మాత్రం గ్యారెంటీ అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

Related Posts