నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

నవీన్‌ పొలిశెట్టి ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగించే అంశం.. యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయతో ఫామ్‌లోకొచ్చిన నవీన్, జాతిరత్నాలుతో హిట్ కంటిన్యూ చేసాడు. నవీన్ పొలిశెట్టి నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా మినమమ్‌ గ్యారెంటీ హిట్ అనే ఇమేజ్ వచ్చిపడింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో తన స్టైల్‌లో డిఫరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్‌ సాధించాడు. ఇంతకీ ఆ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే…అమెరికాలో నవీన్‌ కు యాక్సిడెంట్ అయ్యిందట. సినిమా షూటింగ్ లో భాగంగా జరిగింది కాదంటున్నారు. బైక్ నుంచి పడటంతో చేయి ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది. రెండు నెలలు బెడ్ రెస్ట్ సూచించారట డాక్టర్స్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నవీన్ పొలిశెట్టికి ఈ టైమ్‌లో ఇలా జరగడం దురదృష్టం. గెట్‌ వెల్‌ సూన్ నవీన్ పొలిశెట్టి.

Related Posts