టిల్లు ఈవెంట్‌కు అనుపమ మిస్‌.. ట్రోలర్స్‌కు టిల్లు స్పెషల్‌ క్లాస్‌

టిల్లు స్క్వేర్‌.. ఇది డిజె టిల్లు కు సీక్వెల్. ఈ సినిమా ఎంత హిలేరియస్‌ ఎంటర్‌టైన్ ఇచ్చి.. సెన్సేషన్‌ హిట్ అయ్యిందో.. టిల్లు స్క్వేర్ పై అంత క్యూరియాసిటీ పెంచింది. అయితే దానికంటే ఎక్కువగా టిల్లు స్క్వేర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుపమ ఎందుకు రాలేదనే సస్పెన్స్‌ ఎక్కువైంది. ఎక్కువ ల్యాగ్ లేకుండానే సిద్దు జొన్నలగడ్డ సింపుల్‌ గా చెప్పేసాడు. అంతే కాదు ట్రోలర్స్ కు స్మూత్‌గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ స్టేజ్‌ను కాంట్రవర్శీతో హీటెక్కించడం ఇష్టం లేక చెప్పాలా వద్దా అనుకుంటూనే చెప్పాల్సింది చెప్పేసాడు.

ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. మా హీరోయిన్‌ అనుపమ ఎందుకు రాలేదో తెలుసా అంటూ క్వశ్చన్ చేస్తూ… రీసెంట్‌గా రిలీజయిన ఓ పోస్టర్‌.. ఆ పోస్టర్‌లో అనుపమ హాట్ అప్పీయరెన్స్‌ను ట్రోల్‌ చేస్తూ నెగిటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు చాలామంది నెటిజన్స్‌. సెలబ్రిటీలంటే ఖచ్చితంగా అందరికీ ఆసక్తి ఉంటుంది. అలాగని చెప్పరాని భాషతో కామెంట్స్ చేయడం బాధపెట్టడం మంచిది కాదంటూ సున్నితంగా హెచ్చరిస్తూ… ఓ అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తే.. ఆ అమ్మాయి కూడా ఎంజాయ్‌ చేసేలా ఉండాలి.. మనం చేసే కామెంట్ కూడా అలాగే ఉండాలంటూ క్లాస్‌ పీకాడు. ఇదంతా ఇంటర్నెట్‌ ఉండి పనిపాటలేని బ్యాచ్ పనే అంటూ.. అనుపమ రాకపోవడానికి ఈ నెగిటవ్‌ కామెంట్స్‌ , ట్రోల్సే అని తేల్చేసాడు. అంతకుముందే.. అన్నీ ఒకేరకమైన క్యారెక్టర్స్‌ చేస్తూ బోర్‌ ఫీలవుతారనీ.. అందుకే ఇలాంటి క్యారెక్టర్స్‌ కూడా ఎంచుకున్నానని చెప్పింది అనుపమ. అయినా ట్రోలర్స్‌, నెగటివ్ కామెంట్స్ ఆగకపోవడంతో.. సిద్దు స్టేజ్‌మీద రియాక్ట్ కావడం కరెక్టేనంటూ..ట్రోలర్స్‌ను తిట్టిపోస్తున్నారు నెటిజనం.

Related Posts