చంద్రముఖి 2 రిలీజ్ డేట్ వచ్చింది

చంద్రముఖి సినిమా చాలామందికి ఓ మంచి జ్ఞాపకం. ఎంత భయపడ్డా.. ఎంటర్టైన్మెంట్ కు కొదవ లేకుండాఅద్భుతమైన థ్రిల్లింగ్ తో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది.

విశేషం ఏంటంటే ఇది 1993లో వచ్చి మళయాల చిత్రం మణిచిత్రతాళుకు రీమేక్. దశాబ్దం తర్వాత రీమేక్ అయినా.. రజినీ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చిన కథనం అదిరిపోయింది. బట్ కథలో మాత్రం ఏ మార్పులూ చేయలేదు. పి వాసు డైరెక్ట్ చేసిన చంద్రముఖి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ చిత్రానికి సీక్వెల్ గా తర్వాత వాసునే తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. అయితే ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత హారర్ మూవీస్ స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ చంద్రముఖి2 అనే సినిమాతో రాబోతున్నాడు.

చాలా రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈమూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.


ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు రాఘవ లారెన్స్.
విశేషం ఏంటంటే.. లారెన్స్ నటిస్తున్నాడు కాబట్టి అతనే డైరెక్ట్‌ చేస్తున్నాడు అనుకున్నారు చాలామంది. కానీ కాదు. ఈ చిత్రాన్ని కూడా పి వాసునే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మరో విశేషం.. ఈ మూవీలో ఈ సారి నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ, కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ యేడాది వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. ఆ టైమ్ కు తెలుగులో సెప్టెంబర్ 15న రామ్ – బోయపాటిల స్కంధ, సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ల డిజే టిల్లు స్క్వేర్ ఉన్నాయి.

సో.. ఈ మూవీని కూడా దాదాపు అదే టైమ్ కు విడుదల చేసే అవకాశం ఉంది. మరి పి వాసు సీక్వెల్ నాగవల్లితో షాక్ తిన్నాడు. మరి ఈ చద్రముఖి2తో ఈ సారి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తాడో చూడాలి.

Related Posts