క్రేజీ ఆఫర్ కొట్టేసిన చాందిని చౌదరి

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిలు కరువైపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. మేమున్నామంటూ.. అడపాదడపా కొంతమంది తెలుగమ్మాయిలు కథానాయికలుగా అలరిస్తూనే ఉన్నారు. ఈకోవలోకి వచ్చే బ్యూటీ చాందిని చౌదరి. తొలుత షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన చాందిని.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, బ్రహ్మోత్సవం, శమంతకమణి’ వంటి చిత్రాలలో చిన్న పాత్రల్లో మెరిసింది. ఆ తర్వాత కథానాయికగా ‘కేటుగాడు, కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, మను’ వంటి చిత్రాల్లో నటించినా.. ‘కలర్ ఫోటో’ కథానాయికగా మంచి గుర్తింపునిచ్చింది.

‘కలర్ ఫోటో’ నుంచి చాందిని చౌదరి అందరికీ తెలిసింది. ఈ సినిమా తర్వాత కథానాయికగా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెరుస్తూ వస్తోంది. లేటెస్ట్ గా ‘గామి’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది చాందిని. ఇక.. ఈసారి ఈ తెలుగమ్మాయికి ఓ బిగ్ ఆఫర్ లభించిందట. నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుందట చాందిని చౌదరి.

బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ గా చాందిని చౌదరిని మరో కీ రోల్ కోసం ఎంపిక చేశాడట డైరెక్టర్ బాబీ. త్వరలోనే చాందిని NBK 109 షూట్ లో పాల్గొంటుందట.

Related Posts