వీటికంటే మంచి ఫొటోలు మీడియాకి దొరకలేదా..మన్సూర్ ఆలీఖాన్

నటుడు మన్సూర్ ఆలీఖాన్ హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద సంచలనం సృష్ఠిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రిషకి సినీ ప్రముఖుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇప్పటికే, నితిన్, మెగాస్టార్ చిరంజీవి అలాగే పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయితే, తాజాగా మరోసారి మన్సూర్ అలీఖాన్ త్రిషపై కామెంట్స్ చేయడం ఆశ్చర్యకరం.

నేను చేసిన కామెంట్స్‌ను త్రిష ఖండించింది. ఆ స్టేట్‌మెంట్‌తో పాటు మా ఇద్దరి ఫొటోలను మీడియా ప్రింట్ చేసింది. వీటిలో త్రిష పెళ్లి కూతురులా నేను పెళ్లికొడుకులా కనిపిస్తున్నాము. ఇంతకన్నా మంచి ఫొటోలు నావి దొరకలేదా..? అంటూ మన్సూర్ ఆలీ మరోసారి వివాదాస్పదంగా మాట్లాడాడు. ఇదే సందర్భంగా నానుంచి ఎలాంటి వివరణ కోరకుండా త్రిషకి క్షమాపణలు చెప్పమని నడిగర్ సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనికి నేను ఒప్పుకోను..అంటూ నడిగర్ సంఘం ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని మీడియా ద్వారా కోరాడు. అంతేకాదు, నేను త్రిష గురించి తప్పుగా మాట్లాడలేదు..’లియో’ సినిమలో ఉన్న సీన్ గురించే మాట్లాడాను. కానీ, మీడియా నా మాటలను వక్రీకరించిందని అన్నాడు. నాకు తమిళ ప్రేక్షకుల మద్ధతు ఉందని ధీమాను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మన్సూర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Posts