వ్యవస్థను ప్రశ్నించే ‘కోట బొమ్మాళి పీఎస్‌’

మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘నాయట్టు‘ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చాన్నాళ్లనుంచే ప్రయత్నాలు చేశారు నిర్మాత అల్లు అరవింద్. తొలుత రావు రమేష్, అంజలి వంటి వారితో ఈ రీమేక్ కి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన తారాగణంగా వచ్చారు. తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందిన ‘కోట బొమ్మాళి పీఎస్‘ మూవీ.. వ్యవస్థ ను ప్రశ్నించే చిత్రం అవుతోందనేది చిత్రబృందం చెబుతున్న మాట.

ఇప్పుడున్న వ్యవస్థలో పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేది ఈ సినిమాలో చూపించామంటున్నారు. ఒక పొలిటీషియన్ చేతుల్లో పోలీసులు ఎలా కీలుబొమ్మలుగా మారుతున్నారు.. రాజకీయ నాయకుల వలన వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వంటివి ఈ సినిమాలో చూపించబోతున్నారట. అలాగే.. ఒక పొలిటికల్ లీడర్ ఎంత ఇంపార్టెంట్? ఆ లీడర్‌ ని ఎన్నుకునే ఓటర్ ఎంత ఇంపార్టెంట్? ఓటర్ ఐడీ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని చిత్రబృందం చెబుతోంది. నవంబర్ 24న ‘కోట బొమ్మాళి పీఎస్‘ విడుదలవుతోంది.

Related Posts