టాలీవుడ్

భోళా శంకర్ మేమే చేశామా అనే డౌట్ వచ్చింది – రామ్ లక్ష్మణ్

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రంగరంగ వైభవంగా జరుగుతోంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లి పాత్రలో తమన్నా చిరంజీవికి జోడీగా నటించిన సినిమా ఇది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి.


” ఈ ఫంక్షన్ కోసం మెగాస్టార్ అభిమానులందరూ నాలుగు గంటల నుంచే వెయిట్ చేస్తున్నారు. మీ ఎనర్జీయే సినిమా పరిశ్రను ఎక్కడికో తీసుకువెళుతున్నాయి. అందుకు మీ అందరికీ నమస్కారం. అన్ని పరిశ్రమలు తెలుగు పరిశ్రమపై కన్నేశాయంటే కారణం దర్శకులు. భోళా శంకర్ టీజర్ చూశాం. ఇది మేమే చేశామా అనే డౌట్ మాకే వచ్చింది. కొత్త స్టైల్లో అన్నయ్య ఎనర్జీని ప్రెజెంట్ చేశాం.

టీజర్ లో రోప్ షాట్స్ చూసి ఉంటారు. కానీ ఈ ఏజ్ లో కూడా అన్నయ్య అన్నీ ఒరిజినల్ గా చేశారు. ఎంత రిస్క్ అయినా చేస్తా అని చెప్పి యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎన్నో రిస్క్ లు చేశారు. అన్నయ్యను పాతికేళ్లు వెనక్కి తీసుకువెళ్లి చూపించిన డడ్లీగారికీ, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మణిశర్మ గారి అబ్బాయి మహతి స్వరసాగర్ గారికి థ్యాంక్యూ.

మెహర్ రమేష్ గారితో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. అందరినీ ప్రేమతో పలకరించే దర్శకుడు భోళా శంకర్. ఈ సినిమాలో అన్నయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారిని ఒకసారి అడిగాను.. ఇంత ఎనర్జీ ఏంటన్నయ్యా.. 8గంటలకు రమ్మన్నా 7గంటలకే ఎలా వస్తున్నారు అని అడిగితే.. నాకు సినిమానే అంతా.. షూటింగ్ లేకపోతే నాకు ఏం తోచదు అని మెగాస్టార్ గారు చెప్పారు. అదీ ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమ. మీరు కూడా మీ జీవితాలను ప్రేమించండి. మీరు కోరుకున్నది జరుగుతుందీ అన్నారు.

Telugu 70mm

Recent Posts

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

16 mins ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

36 mins ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

3 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

4 hours ago

బుల్లితెర నటుడు చందు జీవితంలో మరో కోణం

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సీరియల్ నటి పవిత్ర కార్ యాక్సిడెంట్ లో మరణించడం వలనే చందు…

4 hours ago

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి…

12 hours ago