టాలీవుడ్

భోళా శంకర్ లో నాది కేమియో రోల్ – సుశాంత్

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుశాంత్ మాట్లాడుతూ.. ” ముందుగా మెహర్ రమేష్ గారితో మొదలుపెట్టాలి. మెగాస్టార్ గారితో మా జెనరేషన్ నటించడం అదృష్టం. ఆ అదృష్టం నాకు కల్పించినందుకు థ్యాంక్స్. మీరు చిరంజీవిగారికి రిలేటివ్ అయినా ఈ సినిమా కోసం ఎంత తపించారో నాకు తెలుసు. అన్నయ్యను ఇలా చూపిద్దాం అనుకుంటున్నాం.. అలా చూపిద్దాం అనుకుంటున్నాను అని నాకు రెగ్యులర్ గా చెప్పేవారు.

ఈ మూవీకి నన్ను తీసుకున్నప్పుడు నేను రావణాసుర కోసం లాంగ్ హెయిర్ తో ఉన్నాను. అయినా నాకు హెయిర్ స్టైలిస్ట్ పెట్టి మరీ మేకోవర్ చేయించారు. ఇక ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమాకు మెగాస్టార్, కీర్తి సురేష్, తమన్నా ముగ్గురూ మూడు పిల్లర్స్. నాది కేమియో అంటారా స్పెషల్ రోల్ అంటారా తెలియదు కానీ ఈ భోళా మేనియాలో నా పాత్రను ఓ చిరుగాలిలా ప్రెజెంట్ చేశారు. తమన్నా నా ఫస్ట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.

కానీ ఈ సినిమాలో సిస్టర్ గా నటించింది. కానీ కీర్తి పెయిర్ గా నటించింది కదా అన్నారు. అది మా ముగ్గురి మధ్యా జోక్. తమన్నా ఆ మూవీ నుంచి ఈ మూవీ వరకూ అదే డెడికేషన్. అందుకే తను అన్ని ప్లాట్ ఫామ్స్ లోనూ ఆకట్టుకుంటోంది. కీర్తి సురేష్ కు ప్రిపరేషన్ అక్కర్లేదు. తను అంత మంచి యాక్ట్రెస్. ఇక చిరంజీవి గారు నవరసాల్లో ఆల్ రౌండర్ కాబట్టే మెగాస్టార్ అయ్యారు. కానీ డ్యాన్స్ అంటే మన కల్చర్ లో పాతుకుపోయింది. నేను ఫస్ట్ టైమ్ రౌడీ అల్లుడు సినిమాలో బోలో బోలో రాణీ పాట టైమ్ లో కలిశాను. అప్పుడు ఆజ్ కా గూండా రాజ్ పాటలు చూసి ప్రాక్టీస్ చేసేవాణ్ని. అలాంటిది ఈ రోజు ఈ ఛాన్స్ వచ్చిందంటే చెప్పలేని ఆనందంగా ఉంది.

అప్పట్లో తాతగారు ఏఎన్నార్ గారు డ్యాన్స్ లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈ మూవీలో ఆయన గ్రేస్ గురించి అడిగితే కొన్ని టిప్స్ చెప్పారు. మరిన్ని అడిగితే చెప్పడం కుదరదు అని సరదాగా అన్నారు. అలాంటిది ఆయనతో స్టెప్పులు వేయడం లైఫ్ టైమ్ మెమరీ. మా జెనరేషన్ కి డ్యాన్స్ అంటే చిరంజీవి గారే. ఈ సినిమాకు సంబంధించి నాకు బ్లాక్ బస్టర్ మెమరీస్ ఉన్నాయి. ఈ సినిమా కోసం మీ అందరి లాగే ఫ్యాన్ లాగా వస్తున్నాను.. ” అన్నాడు.

Telugu 70mm

Recent Posts

సెట్స్ పై సందడి చేస్తున్న సినిమాల సంగతులు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. అత్యంత భారీ బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ఇది.…

35 mins ago

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బయోగ్రఫీ

కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు…

1 hour ago

Malayali Star In Mahesh-Rajamouli Movie?

Director Rajamouli's film with superstar Mahesh Babu is in the pre-production stage. Soon.. they will…

2 hours ago

Shankar Is Going To Give A Double Bang To Kamal

The film 'Indian 2', which was completely stopped. 'Indian 2', which is currently in the…

3 hours ago

‘Abbai’ Out Of Dasara for Babai

If Natasimham Balakrishna commits once, he will not listen to anyone. He doesn't care how…

3 hours ago

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

16 hours ago